వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందనే సంగతి తెలిసిందే. షూటింగ్ ల బంద్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ బడ్జెట్ ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు వెళ్లింది అనేది మంచి క్వశ్చన్ అని ఆయన అన్నారు. హీరోయిన్ కు ఎనిమిది మంది స్టాఫ్, మేకప్ మెన్లు, ఇతర విషయాలు సినిమాకు సంతకం చేసే ముందే నిర్మాతకు తెలుస్తాయని ఆర్జీవీ వెల్లడించడం గమనార్హం. ఉదాహరణకు రాజమౌళి బాహుబలి సినిమా ఉందని శ్రీదేవి గారు తనతో పాటు చాలామంది వస్తారని డిమాండ్లు చెప్పారని
ఆమె చెప్పిన డిమాండ్లు వర్కౌట్ కావని రాజమౌళి చెప్పాడని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాజమౌళి రమ్యకృష్ణను తీసుకున్నారని ఆర్జీవీ వెల్లడించారు. ఇదే పని అందరూ ఎందుకు చేరని వర్మ చెప్పుకొచ్చారు. రాజమౌళి ట్రాక్ రికార్డ్ కు శ్రీదేవి ఉన్నా లేకపోయినా అవసరం లేదని వర్మ తెలిపారు. డిమాండ్ ఎంత ఎక్కువ ఉంటే రేటు అంత పెరుగుతుందని వర్మ చెప్పుకొచ్చారు. అందరు నిర్మాతలు ఒకే విధంగా ఆలోచించరని వర్మ వెల్లడించారు.
తాను కంపెనీ సినిమా కోసం అమోల్ పాలేకర్ అనే వ్యక్తిని కలవగా ఆయన రోజుకు 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని వర్మ తెలిపారు. ఆ వ్యక్తిని నేను తీసుకోలేదని వర్మ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో బాటా రేటు ఉండదని వర్మ అన్నారు. షాప్ లో ఒక రేటు కంటే ఎక్కువ రేటుకు షర్ట్ ను అమ్మకూడదనే నిబంధన ఉండదని వర్మ తెలిపారు. చిన్న సినిమా బడ్జెట్ పరంగా వేరని అవగాహన పరంగా వేరని వర్మ చెప్పుకొచ్చారు.
పెద్ద కెమెరామేన్ చిన్న సినిమాలు చేయడని వర్మ కామెంట్లు చేశారు. ఆడియన్స్ టికెట్ ఎవరిని చూసి కొంటున్నారో వాళ్లకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని వర్మ చెప్పుకొచ్చారు. ఎవరి బ్రతుకు వాళ్లను బ్రతకనివ్వాలని ఎవడి చావు వాడిని చావనివ్వాలని వర్మ కామెంట్లు చేశారు. వర్మ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?