రాజమౌళిపై కామెంట్స్ ఆపని రామ్ గోపాల్ వర్మ
- April 25, 2017 / 08:38 AM ISTByFilmy Focus
రామ్ గోపాల్ వర్మ అభినందించినా.. విమర్శించినట్లుగా ఉంటుంది. ఆ మాట తీరే వెటకారానికి అప్ గ్రేడ్ వెర్షన్ లా ఉంటుంది. అందుకే ఏడాదిగా ఆయన ట్వీట్స్ అర్ధం చేసుకోలేక చాలామంది తలపట్టుకు కూర్చున్నారు. కొంతమంది ఆగ్రహంతో ఊగిపోయారు. రెండు రోజుల క్రితం నుంచి అతని మాటల తుపాకిని రాజమౌళిపై మళ్లించారు. బాహుబలి కంక్లూజన్ లోని “సాహోరో బాహుబలి” సాంగ్ ప్రోమో చూసిన ఆయన.. ఆ వీడియోని షేర్ చేస్తూ “సాహారో రాజమౌళి” అని అభినందించారు. అంతేకాకుండా ఇటీవల జక్కన్నతో వర్మ కలిసి దిగిన ఓ ఫొటోను పోస్టు చేస్తూ.. ‘నేను అసహ్యంగా ఉన్నాను. నాకంటే రాజమౌళే చాలా అందంగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.
అయితే వర్మ ట్వీట్‌కు స్పందించిన రాజమౌళి.. ‘ అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆగిన వర్మ.. ఈరోజు సంచలన కామెంట్స్ చేశారు. ‘రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి.. దేశంలోని మిగతా దర్శకులందరినీ టీవీ సీరియల్ డైరెక్టర్లుగా ఫీల్ అయ్యేలా చేసింది’ అంటూ ట్వీట్ చేశారు. మూడు రోజుల్లో బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్లో బిజీగా ఉన్న రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













