ఇప్పుడు మహేష్ వంతు వచ్చిందా…వర్మ!!
- January 27, 2017 / 06:23 AM ISTByFilmy Focus
ప్రముఖ దర్శక నిర్మాత…అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ…మళ్లీ నోరు పారేసుకున్నారు….ఇప్పటివరకూ ఆయన టచ్ చెయ్యని హీరో ప్రిన్స్ మహేష్ బాబుని ఒక రౌండ్ వేసుకున్నాడు… విషయం ఏమిటంటే….ఇప్పటివరకూ వర్మ ఎప్పుడు ప్రిన్స్ ను కామెంట్ చేసింది లేదు…అయితే జల్లికట్టు విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు స్పందించిన తీరు….స్పెషల్ ప్యాకేజ్ విషయంలో మౌనం వహించిన తీరు అన్నీ వెరసి ప్రిన్స్ పై విరుచుకు పడ్డాడు వర్మ…విషయంలోకి వెళితే…జల్లికట్టుపై రియాక్ట్ అయిన మహేశ్.. ప్రత్యేక హోదా సాధనకోసం విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర మౌన నిరసనను నిర్వహించాలని చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన వర్మ.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. మహేశ్ భాబుల తీరుపై రియాక్ట్ అయ్యారు.
మహేశ్ బాబు తమిళుల జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు కానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా విషయంలో మాత్రం రియాక్ట్ కాలేదు. అంతేకాదు…వర్మ మాటల్లో ఆంతర్యం ఏమైనా…కాస్త లోతుగా పరిశీలిస్తే…అర్ధం అవుతుంది….ప్రత్యేక హోదా అంశంపై పవన్ పట్టించుకున్నంతగా మహేశ్ పట్టించుకోలేదని చెప్పటమే కాకుండా.. ఈ విషయంలో ఇద్దరికి మధ్య తేడా ఇదేనంటూ ట్వీట్ లో తన ఆలోచనని బయట పెట్టాడు వర్మ….అయితే ఈ విషయంలో ప్రిన్స్ మాట్లాడకపోవడానికి తన బావ ఏపీ అధికారపక్ష టీడీపీకి చెందిన ఎంపీ కావటం కారణం అని…అందుకే మహేశ్ మౌనంగా ఉన్నారన్న వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది..మరి ఈ విషయం….విషంగా మారక ముందే….ప్రిన్స్ ఏమైనా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడేమొ చూద్దాం…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















