అందులో వర్మ కొత్తగా చూపించింది ఏముంది?

  • September 26, 2020 / 12:50 PM IST

హైదరాబాద్ లో జరిగిన ‘దిశా’ హత్యాచార ఘటన సంచలనమైంది. కీచకుల నుండి ఆడపిల్లలను ఎలా రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దిశా మరణానికి కారణమైన మానవ మృగాలను పోలీసులు ఎన్కౌంటర్ చెయ్యడాన్ని కొందరు హర్షిస్తే, మరికొందరు మానవ హక్కుల ఉల్లఘించారని విమర్శలు చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే రామ్ గోపాల్ వర్మ ఈ ‘దిశా’ ఘటన మీద కూడా సినిమా తీశారు. నేడు ‘దిశా ఎన్కౌంటర్’ ట్రయిలర్ విడుదల చేశారు.

టెక్నికల్ పరంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. ‘దిశా ఎన్కౌంటర్’ ట్రయిలర్ లో సైతం టెక్నికల్ అంశాలు బావున్నాయి. నేపథ్య సంగీతం ఉత్కంఠ కలిగించింది. ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో ఆ తరహా కెమెరా షాట్స్ ఉన్నప్పటికీ… ట్రయిలర్ ఎండింగ్ లో అవుటర్ రింగ్ రోడ్డు మీద వెహికల్స్ వెళుతుంటే కింద సబ్ వేలో అమ్మాయి దేహానికి నిప్పు అంటించిన విజువల్స్ చుట్టుపక్కల, కిందపైన ఏం జరుగుతుందో పట్టించుకోని నగర వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ప్రస్తుతానికి చూపించిన కథ విషయానికి వస్తే కొత్తగా ఏమీ లేదు. ఆల్రెడీ పేపర్లలో చదివినదీ, న్యూస్ ఛానళ్లలో విన్నదీ వర్మ, అతడి టీమ్ చూపించారు.

శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, ప్రవీణ్ రాజ్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఆనంద్ చంద్ర డైరెక్షన్ చేశారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ ప్రొడ్యూస్ చేశారు. డి.ఎస్.ఆర్ మ్యూజిక్ అందించారు. నవంబర్ 26న సినిమా రిలీజ్ చెయ్యన్నట్టు ట్రయిలర్ లో తెలిపారు.


బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus