వివాదాల దర్శకుడు రామ్ గోపాల వర్మ తన పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలుగు ప్రజలందరీని కమ్మగా కాపు కాసే శక్తి పవర్ స్టార్ అని, అతనే అత్యుత్తమ నాయకుడని ట్విట్టర్ వేదికపై వివరించారు. కమ్మ, కాపు అంటే కులాలు అని పొరబడేవారు.. ఆ ఉద్దేశంతో తాను పోస్ట్ చేయలేదని చమత్కరించారు. మంచిగా కాపాడే నాయకుడని అర్ధం వివరించారు.
అయితే ఈ ట్వీట్స్ వెనుక అసలైన అర్ధం పవన్ ఫ్యాన్స్ కి 24 గంటల్లో తెలిసిపోయింది. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన “వంగవీటి” చిత్రం ట్రైలర్ కి ఇది ప్రీ పబ్లిసిటీ అని స్పష్టమయింది. పవన్ ని అభినందిస్తూ అక్టోబర్ 1 న ట్వీట్ చేస్తే, మరుసటి రోజే (అక్టోబర్ 2) వంగవీటి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ రెండింటిలో కామన్ పాయింట్ కమ్మ, కాపు. దీంతో వర్మ ఆడిన గేమ్ అందరికీ అర్ధమయింది. సినీ కెరీర్ గ్రోత్ కోసం రెండు సామాజిక వర్గాలతోను, పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న వర్మపై చాలామంది సీరియస్ గా ఉన్నారు. రీ ట్వీట్లలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, మరి ఈ కాంట్రవర్సీని డైరక్టర్ ఎలా క్యాష్ చేసుకుంటారో చూడాలి.
I am super sure that Pawan Kalyan will be the ultra ultimate Kaapu Kaase Shakthi of the entire telugu people