ఆఫీసర్ ప్రసన్న గురించి వర్మ చెప్పిన ఆసక్తికర సంగతులు

కంపెనీ బ్యానర్లో రామ్ గోపాల్ వర్మ నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా ఆఫీసర్. కింగ్ అక్కినేని నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ కథపై అనేక రూమర్లు వచ్చాయి. కొంతమంది ఈ చిత్ర కథ ‘టేకెన్‌’ అనే హాలీవుడ్‌ సినిమా ఆధారంగా తెరకెక్కించినట్లు ఆరోపించారు. ఇంకొకరు ఈ కథ నాదే అంటూ మీడియాముందు వాపోతున్నారు. దీంతో ఈ వార్తలపై వర్మ తాజాగా క్లారిటీ ఇచ్చారు. “నాగార్జున నటించిన ‘ఆఫీసర్‌’ సినిమా కర్ణాటకకు చెందిన కె.ఎమ్‌ ప్రసన్న అనే ఐపీఎస్‌ అధికారి జీవితాధారంగా తెరకెక్కించాం. ముంబయికి చెందిన పేరున్న పోలీసు అధికారి కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఏసీపీగా ప్రసన్నను నియమించారు.

ఈ కేసుకు సంబంధించిన విషయాలను ప్రసన్న నాకు 2010లో చెప్పారు. అవి విన్నాకే నాకు ‘ఆఫీసర్’ సినిమాను తీయాలన్న ఆలోచన వచ్చింది. ఇందులో నాగ్‌.. ప్రసన్న పాత్రలో నటించారు. ఇద్దరినీ కలిశాక నేను గమనించింది ఏంటంటే.. నాగ్‌, ప్రసన్న ఆలోచనా విధానం ఒక్కటే. దానినే ‘ఆఫీసర్‌’ సినిమాలోనూ చూపించాను” అని వర్మ వివరించారు. ఇప్పటికైనా ఆరోపణలు ఆగుతాయేమో చూడాలి. పాతికేళ్ల తర్వాత వర్మ, నాగ్ కలిసి చేస్తున్న ఈ సినిమా జూన్‌ 1 న థియేటర్లోకి రానుంది. వరుస అపజయాలతో సతమవుతున్న వర్మ ని ఈ సినిమా అయినా గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus