విజయ్ దేవరకొండ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణమేంటి? ఈ మాటకు ఎవరైనా ఠక్కున చెప్పే ఆన్సర్.. అతని యాటిట్యూడ్. కుర్రకారు ఎప్పుడైనా యాటిట్యూడ్‌కి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. గతంలో పవన్ కల్యాణ్‌కు అంత ఫ్యాన్ బేస్ ఒక్కసారిగా పెరిగింది అన్నా.. అదే కారణం. అయితే అతని యాటిట్యూడ్‌ని విమర్శించే వాళ్లూ ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ సమయంలో కూడా యాటిట్యూడ్ గురించి చర్చ వచ్చింది. తాజాగా దీనిపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు.
‘వాట్ లగా దేంగే’ అంటూ ఆగస్టు 25 ముందు వరకు దేశాన్ని ఓ ట్రిప్ వేశాడు విజయ్ దేవరకొండ. ‘లైగర్’ కోసం ఆయన చేసిన ప్రచారం అది. ఆ మాటలో సినిమా మీద నమ్మకంతోపాటు ఓ యాటిట్యూడ్ కూడా కనిపించింది. ఆ తర్వాత ప్రచారంలో సరైన ఏర్పాట్లు చేసుకోకుండా.. అభిమానులు ఎక్కువైపోయారు అందుకే మధ్యలోనే వెళ్లిపోతున్నాం అంటూ ఓ ప్రచారం చేసుకున్నారు. తెలుగు దగ్గరకు వచ్చేసరికి.. మీడియా ముఖాన, ప్రేక్షకుల ముఖాన కాలు పెట్టి మాట్లాడాడు. అయితే ఇలాంటి యాటిట్యూడ్.. వర్మకు సరైందిగానే అనిపిస్తోందట.
“నార్త్ వాళ్లకు సౌత్ స్టార్స్ నచ్చడం వెనుక ఉన్న ప్రధాన కారణం వాళ్లు కూల్‌గా ఉండే విధానం. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా అందరూ ఎంతో కూల్‌గా ఉండి అక్కడివారి మనసులు గెలుచుకున్నారు. విజయ్ దేవరకొండ దగ్గర అది కనిపించలలేదు. అతను కూడా వాళ్లకు బాలీవుడ్ స్టార్ లాగే కనిపించాడు’’ అంటూ విజయ్ ఎట్ బాలీవుడ్ గురించి వివరించారు వర్మ. అంతేకాదు విజయ్ తొలుత నుండి ఇలానే ఉన్నాడని, అతను ఇప్పుడు పెద్దగా మారింది లేదు అని కూడా చెప్పారు.
‘‘విజయ్ మొదటినుండి అలాగే ఉన్నాడు. విజయ్ దేవరకొండకు క్రేజ్ తీసుకొచ్చింది అదే. యూత్‌లో రౌడీ ఇమేజ్ తెచ్చింది కూడా ఈ యాటిట్యూడే. అలాంటి విజయ్ ఆటిట్యూడ్‌లో తప్పు లేదు.. కానీ టైమింగ్‌లోనే తప్పుంది. దేశాన్ని షేక్ చేసిన ‘కశ్మీర్ ఫైల్స్’ తీసిన వివేక్ అగ్నిహోత్రి కూడా ఇలాంటి యాటిట్యూడే చూపించారు. ఇంకా చెప్పాలంటే విజయ్ కంటే పది రెట్లు ఎక్కువ యాటిట్యూడ్ మాట్లాడాడు ఆయన. అయితే ఆయన సినిమా ఆడింది, విజయ్ సినిమా ఆడలేదు. అదొక్కటే తేడా. కాబట్టి టైమింగ్ బాగోలేకపోతే యాటిట్యూడ్ అలానే ఇబ్బంది పెడుతుంది’’ అని అన్నారు వర్మ.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!