అవే కెమెరా యాంగిల్స్…అదే వర్మ..!

రామ్ గోపాల్ వర్మ వ్యాపారం జోరుగా సాగుతున్న వేళ మరో సినిమాతో వచ్చేశాడు. ఆయన గతంలో ప్రకటించిన థ్రిల్లర్ మూవీ ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఇక థ్రిల్లర్ వర్మ మార్కు సినిమాగా థ్రిల్లర్ ఉంటుందని అర్థం అవుతుంది. హీరోయిన్ అప్సరా రాణి గ్లామర్, సస్పెన్సు ఈ మూవీ ప్రధాన అంశాలు అయ్యే అవకాశం కలదు. ఆహ్లాదంగా గడపడానికి ఫార్మ్ హౌస్ కి వెళ్లిన యువ జంటకు ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులే థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది. వర్మ గత రెండు డిజిటల్ మూవీస్ క్లైమాక్స్, నగ్నం చిత్రాలు బ్లెండ్ చేస్తే థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది.

ఇక సంప్రదాయవాదులను ఇబ్బందిపెట్టే కెమెరా యాంగిల్స్ ఈ మూవీలో కూడా వర్మ ఉపయోగించాడు. పెట్టకూడని చోట కెమరా పెట్టి తన భీబత్సమైన క్రియేటివిటీ చాటుకున్నారు. ఐతే థ్రిల్లర్ ట్రైలర్ ని చూసిన తరువాత సినిమాపై ఏమంత ఆసక్తి కలగలేదు. థ్రిల్లర్ మూవీలో ఊహించని థ్రిల్స్ ఉంటాయనేది అసంభవమే. వర్మ నుండి సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ వస్తుంది. ఆ రెండు ట్రైలర్స్ లో ఏముంటుందో అదే సినిమా. వర్మ గత చిత్రాలన్నీ గమనిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది.

నగ్నం, క్లైమాక్స్ మరియు పవర్ స్టార్ చిత్రాల ట్రైలర్స్ తో అలరించిన వర్మ థ్రిల్లర్ విషయంలో కొంచెం కూడా మూవీపై ఆసక్తి కలిగించలేకపోయాడు. ఏది ఏమైనా అతి తక్కువ బడ్జెట్ తో వర్మ సినిమాలు తెరక్కిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు చూసినా, చూడకున్నా, ఆయనకు వచ్చిన నష్టం ఏమి ఉండదు.


పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus