RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!
- December 23, 2025 / 06:21 PM ISTByFilmy Focus Desk
RGV : సంచలన దర్శకుడు ఆర్జీవీ ఒకప్పుడు తనకు మాత్రమే సొంతమైన టాలెంట్ తో విలక్షణ చిత్రాలను డైరెక్ట్ చేసి భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచారు అనటంలో ఏ మాత్రం సందేశం లేదు. అయితే ఈ మధ్య తన సినిమాలు అంతగా ప్రేక్షకులను మెప్పించకపోయిన, సోషల్ మీడియా వేదికగా తాను చేసే ట్వీట్లు మాత్రం ఒక రేంజ్ లో వైరల్ గా మారుతాయి. ఎందుకంటే అంత కాంట్రవర్సియల్ గా ఆయన స్పందన ఉంటుంది. నిన్న ఒక సినిమా ఈవెంట్ లో నటుడు శివాజీ కథానాయికల ఆహార్యంపై చేసిన వ్యాఖ్యలు కొంచం ఇబ్బందిగా ఉండటం తో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. దీనిపై ‘X’ వేదికగా ఆర్జీవీ ఏమన్నారంటే..?
“హేయ్ శివాజీ నువ్వు ఎవరైనా కావొచ్చు. నీలాంటి డర్టీ గాయ్ ఇండస్ట్రీలో మహిళలు గానీ, సమాజంలోని ఇతర మహిళలు గానీ ఎవరి జీవితాలపై వాళ్లకు పూర్తి హక్కు ఉంటుంది. వారి ఎంపికలపై తీర్పులు చెప్పడం అనవసరం” అని RGV తన మాటల ద్వారా స్పష్టంగా చేశారు. ముఖ్యంగా మహిళలపై చాదస్తాన్ని ప్రదర్శించడం సరికాదని, అలాంటి ఆలోచనలు వ్యక్తిగత పరిధికే పరిమితం కావాలని ఆయన ఘాటుగానే స్పందించటం జరిగింది.

ఈ ట్వీట్ వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది RGV తీసుకున్న స్టాండ్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఈ వివాదం మరింత పెద్దదయ్యే అవకాశముందని అంటున్నారు. ఏదేమైనా, హీరోయిన్ల వస్త్రధారణపై మొదలైన ఈ అంశం ఇప్పుడు మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత హద్దులు అనే పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయంలో ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్.. హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?












