Rishab Shetty: రిషబ్ శెట్టి భార్య గొప్పదనం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే

కాంతార సినిమా సక్సెస్ తో ప్రపంచవ్యాప్తంగా రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగిందనే సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా 20 రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించిందనే సంగతి తెలిసిందే. అయితే రిషబ్ శెట్టి తన సక్సెస్ వెనుక భార్య ఉన్నారని తాజాగా కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని చెబుతారు. అదే విధంగా రిషబ్ శెట్టి సక్సెస్ వెనుక ఆయన భార్య ప్రగతి ఉన్నారు. తాజాగా మోస్ట్ ప్రామిసింగ్ అవార్డ్ ను సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ అవార్డ్ రావడానికి కాంతారకు పని చేసిన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా తన భార్య ప్రగతి కారణమని రిషబ్ శెట్టి కామెంట్లు చేయడం గమనార్హం.

తనకు వచ్చిన అవార్డును కర్ణాటక ప్రజలకు, దైవ నర్తకులకు, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్, దివంగత డైరెక్టర్ భగవాన్ కు అంకితం ఇస్తున్నానని రిషబ్ అన్నారు. అయితే రిషబ్ లవ్ స్టోరీ గురించి చాలామందికి తెలియదు. రిక్కీ మూవీకి రిషబ్ శెట్టి డైరెక్టర్ కాగా ఆ మూవీ ఈవెంట్ లో తన ఫ్రెండ్స్ కు రిక్కీ డైరెక్టర్ ఇతనే అని ప్రగతి పరిచయం చేశారు. ఆ తర్వాత రిషబ్ కు ప్రగతి తన ఊరికి చెందిన అమ్మాయేనని అర్థమైంది.

అప్పటికే రిషబ్ ప్రగతి ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ కావడం గమనార్హం. ఆ పరిచయం ప్రేమగా మారగా 2017లో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. ప్రగతి ఒకవైపు నటిగా మరోవైపు క్యాస్టూమ్ డిజైనర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ప్రగతి కాంతార సినిమాకు కూడా పని చేశారు. ఈ సినిమా షూట్ సమయంలో ప్రగతి గర్భవతి అయినా కాంతార మూవీపై ఉన్న నమ్మకంతో ఆమె ఆ సినిమా కోసం పని చేశారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus