జెనీలియాకు మరో బాబు..!

జెనీలియా మరోసారి తల్లి అయ్యింది. జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ‘ మా అమ్మ నాన్నలు నాకో చిట్టి తమ్ముడిని బహుమతిగా ఇచ్చారు. ఇక నా ఆటబొమ్మలన్నీ అతడికే… ప్రేమతో రియాన్’ అంటూ రితేష్ తన ట్విట్టర్ అక్కౌంట్ లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు రితేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా 2003 లో రితేష్ సరసన ‘ముఝే తేరి కసమ్’ చిత్రంలో నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జెనీలియా 2012 ఫిబ్రవరి లో రితేష్ ను వివాహమాడింది.

2014 నవంబర్ లో రితేష్ దంపతులు రియాన్ కు జన్మనివ్వగా.. తాజాగా మరో మగబిడ్డకు జన్మనిచ్చారు. మరోవైపు 2012 లో విడుదలైన ‘తెరెనాల్ లవ్ హొగయా’ చిత్రం తరువాత జెనీలియా మరే చిత్రం లో నటించలేదు. ప్రస్తుతం రితేష్ హౌస్ ఫుల్ 3 , బాంజో చిత్రాల్లో నటిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus