Ritu Varma: తన పెళ్ళి గురించి హీరోయిన్ రీతూ వర్మ ఆసక్తికరమైన కామెంట్స్..!

రీతూ వర్మ కెరీర్ ప్రారంభంలో ‘బాద్ షా’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి అటు తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘పెళ్ళి చూపులు’ వంటి చిత్రాలతో హీరోయిన్ గా మారింది. అవి హిట్ అయినా ఈ అమ్మడి కెరీర్ స్లోగానే సాగుతూ వచ్చింది. మధ్యలో తమిళ్ లో పలు సినిమాలు చేసింది. అవి రిలీజ్ లేట్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఈ అమ్మడు తెలుగులో మెల్ల మెల్లగా బిజీ అవుతుంది.

నాగ శౌర్య హీరోగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది రీతూ వర్మ. ఆ చిత్రం రేపు అనగా అక్టోబర్ 29న విడుదల కాబోతుంది. ఈ చిత్రం పెళ్ళి కాన్సెప్ట్ తో తెరకెక్కింది. పెళ్ళంటే ఇష్టం లేదు అన్నట్టు ఈమె పాత్ర ఉంటుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. అయితే నిజ జీవితంలో కూడా రీతూ వర్మకి పెళ్ళి పై అలాంటి అభిప్రాయమే ఉందా? ఆమెను ప్రశ్నిస్తే.. కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఆమె మాట్లాడుతూ…

“నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకో రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా ఆ టాపిక్ గురించి అంటుంటారు తప్ప.. పూర్తిగా ఆ విషయాన్ని నాకే వదిలేశారు.ప్రస్తుతం శర్వానంద్ తో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా ఒకటి చేస్తున్నాను. అలాగే తమిళ్ లో ఒక సినిమా,అలాగే ఇంకో వెబ్ సిరిస్ కూడా చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. రీతూ వర్మ కామెంట్స్ ను బట్టి చూస్తే ఇప్పట్లో ఆమె ఫోకస్ మొత్తం సినిమాల పైనే పెట్టినట్టు చెప్పకనే చెప్పినట్టుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus