Ritu Varma: రీతూ వర్మ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన వైష్ణవ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి.. నవంబర్ 1 న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఇటలీలో వరుణ్ – లావణ్య..ల పెళ్లి జరిగింది. వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దాదాపు నెల రోజులకు ముందే మొదలయ్యాయి. మొదట మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తర్వాత రాంచరణ్ ఇంట్లో, అటు తర్వాత అల్లు అర్జున్ ఇంట్లో పార్టీలు జరిగాయి. అయితే అల్లు అర్జున్ – స్నేహారెడ్డి కపుల్ హోస్ట్ చేసిన పార్టీ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

విచిత్రంగా ఈ ఫొటోల్లో టాలీవుడ్ హీరోయిన్ (Ritu Varma) రీతూ వర్మ కూడా దర్శనమిచ్చింది. దీంతో రకరకాల గాసిప్స్ వినిపించాయి.రీతూ వర్మ కూడా ఓ మెగా హీరోతో ప్రేమలో ఉందని.. త్వరలోనే ఆమె కూడా మెగా ఫ్యామిలీలోకి కోడలిగా ఎంట్రీ ఇస్తుందని చాలా మంది కామెంట్లు చేశారు. తాజాగా ఈ రూమర్స్ పై మెగా హీరో వైష్ణవ్ తేజ్ స్పందించాడు. తన ‘ఆదికేశవ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ విధంగా స్పందించాడు.

అతను మాట్లాడుతూ.. “ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. రీతూ వర్మ.. లావణ్య త్రిపాఠికి బెస్ట్ ఫ్రెండ్. అందుకే వరుణ్ – లావణ్య..ల పెళ్లి వేడుకల్లో.. రీతూ వర్మ ఎక్కువగా సందడి చేసింది. అంతే తప్ప ఇంకేమీ లేదు” అంటూ వైష్ణవ్ చెప్పుకొచ్చింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus