బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఆన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి ఈయన ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు.ఇలా ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళగా రెండవ సీజన్ కూడా అంతకుమించి ఉండేలాగా ప్లాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మంత్రి రోజాకి కూడా ఆహ్వానం అందింది. ఇదివరకే ఈమెకు రెండుసార్లు ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తాను ఈ కార్యక్రమానికి వెళ్లడం వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుందన్న కారణంతోనే తాను అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వెళ్లలేదని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన వెళ్ళనని ఈమె తేల్చి చెప్పారు.
ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి చంద్రబాబు వచ్చారో ఆ క్షణమే ఈ షో కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానంతవరకు ఈ షో చాలా అద్భుతంగా చేశారని అనుకున్నా అయితే ఈయన ఈ షోకి హాజరవ్వడం చనిపోయిన ఎన్టీఆర్ గారిని మరోసారి అవమానించిన విధంగా మాట్లాడటంతో తనకు ఈ కార్యక్రమానికి వెళ్లాలన్న ఆసక్తి కూడా లేకుండా పోయిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ద్వారా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడం కరెక్టేగా అనే విధంగా చూపించారని, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వేదికను బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తమ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు అంటూ రోజా మండిపడ్డారు.అందుకే తనకు ఈ కార్యక్రమానికి వెళ్లాలనిపించడం లేదు అంటూ రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?