మెగాస్టార్ చిరంజీవి హీరోగా మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా చరణ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి నెల 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఆచార్య మూవీ రిలీజ్ కానుందని సమాచారం.
తాజాగా ఈ సినిమా నుంచి సానా కష్టం సాంగ్ రిలీజ్ కాగా ఈ పాటకు ప్రేక్షకులలో కొంతమంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కొంతమంది నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్ తో రెజీనా కెసాండ్రా ఈ పాటలో స్టెప్పులు వేశారు. అయితే ఈ పాటలోని ఒక లైన్ ఆర్ఎంపీలను కించపరిచేలా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పాటలో ”ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు” అని ఉన్న లైన్ ఆర్ఎంపీ వృత్తిని కించపరిచే విధంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆర్ఎంపీల సంఘం నాయకులు ఈ పాట ఆర్ఎంపీల వృత్తిని అవమానపరచటంతో పాటు వాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు జనగామ పోలీసులను పాట రచయితపై, డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం గురించి చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. పాట లిరిక్స్ లో మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా పాటలు వివాదాల్లో చిక్కుకున్న సమయంలో లిరిక్స్ లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఆచార్య సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. చిరంజీవి, చరణ్ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం. చరణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.