కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో రాకింగ్ స్టార్ యశ్ ఓవర్ నైట్ లో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో టాక్సిక్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం యశ్ 150 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్న అతికొద్ది మంది నటులలో యశ్ ఒకరు. యశ్ పుట్టినరోజు వేడుక సమయంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 7వ తేదీన యశ్ పుట్టినరోజు బ్యానర్ ను ఏర్పాటు చేస్తూ ముగ్గురు అభిమానులు ప్రమాదవశాత్తూ మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల సహాయం అందించిన యశ్ ఆ ప్రమాదం సమయంలో గాయపడిన వాళ్ల కుటుంబాలకు లక్ష రూపాయల సహాయం అందించారు. యశ్ మంచి మనస్సును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. యశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
యశ్ (Yash) భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో యశ్ సత్తా చాటాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్3 సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కేజీఎఫ్3 మూవీ ఎప్పుడు విడుదలైనా 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కేజీఎఫ్3 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. యశ్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. యశ్ ఇకపై వేగంగా సినిమాలలో నటించాలని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది కేజీఎఫ్ 3 మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.