రోజా (Roja) ఇప్పుడు పొలిటీషియన్. కానీ ఒకప్పుడు హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. అలా అని ఈమెకు స్టార్ స్టేటస్ ఏమీ దక్కలేదు. ఎందుకు దక్కలేదు అంటే.. ఈమె సోలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఎక్కువగా హిట్ అవ్వలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన సోలో హీరోగా చేసిన సినిమాలు ఎక్కువ శాతం ఫ్లాప్ అయ్యాయి. సెకండ్ హీరోయిన్ గా చేసిన సినిమాలు మాత్రమే ఎక్కువ శాతం హిట్ అయ్యాయి.
అయితే గ్లామర్ షో ఎక్కువగా చేసేది కాబట్టి.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల నుండి కూడా ఛాన్సులు వచ్చాయి. హిందీ సినిమాల్లో కూడా స్పెషల్ రోల్స్ చేసింది. అలా బిజీ బిజీగా గడిపేసేది. 2000 వ సంవత్సరం వరకు రోజా హీరోయిన్ గా రాణించింది. ఇది కూడా మంచి ఫీటే..! అయితే తర్వాత కొత్త హీరోయిన్లు, కొత్త హీరోలు రావడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నిలబడలేకపోయింది.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా.. మొదట్లో అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. అయితే వైసీపీ పార్టీలోకి వచ్చాక స్థిరపడింది. మొదట ఎమ్మెల్యేగా గెలిచింది. తర్వాత మంత్రిగా చేసింది. అయితే 2024 ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయింది. ఆమె పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో ఈమె ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దీంతో ‘జబర్దస్త్’ షోకి మళ్ళీ జడ్జ్ గా రావాలని ప్రయత్నాలు చేసింది.
కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ‘జీ’ లో ‘సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్’ అనే షోకి జడ్జ్ గా వ్యవహరించబోతుంది. ఆమెతో పాటు శ్రీకాంత్ (Srikanth), రాశి (Raasi)..వంటి తోటి సీనియర్లు కూడా జడ్జీలుగా చేయబోతున్నారు. ఒక చిన్న ప్రోమో బయటకు వచ్చింది. ఇప్పుడు అది హల్ చల్ చేస్తుంది. మరి ఈ షోతో అయినా రోజా హవా మళ్ళీ మొదలవుతుందేమో చూడాలి.