సీనియర్ స్టార్ హీరోయిన్, జబర్దస్త్ జడ్జి, వైసీపీ ఎమ్మెల్యే అయిన కొద్దిలో విమాన ప్రమాదం నుండీ తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో …గంట వరకు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ ను అర్ధాంతరంగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేశారు.అటు తర్వాత కూడా 4 గంటల వరకు ఫ్లైట్ డోర్లు ఓపెన్ చేయకుండా ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరినీ విమానంలోనే ఉంచేశారు.
ఫ్లైట్ లో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అక్కడైనా సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోజా అయితే ఈ విషయం పై ఫుల్ సీరియస్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ… ‘మేము ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నాం. డోర్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.రాజమండ్రి నుండీ తిరుపతికి వస్తున్న ఈ ఇండిగో ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ రావడంతో బెంగళూరులో ల్యాండ్ చేశారు.
అయితే డోర్లు మాత్రం వెంటనే తెరవలేదు. 4 గంటల పాటు నేను నాతో ఉన్న సహా ప్రయాణికులంతా ఫ్లైట్లోనే చిక్కుకుపోయారు. బ్బులు ఎక్కువగా ఉండడం వల్ల తిరుపతిలో కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో చెప్పారు.కానీ అది టెక్నీకల్ ఇష్యు అని బెంగళూరులో ల్యాండ్ అయ్యాక తెలిసింది.పోనీ డోర్స్ ఓపెన్ చేస్తే బయటకు వెళ్లిపోతామని నాతోటి వారు చెప్పినా ఫ్లైట్ స్టాఫ్ వినలేదు. అధికారుల నుండీ కన్ఫర్మేషన్ వస్తేనే ఓపెన్ చేస్తామని వారు చెప్పారు.
అంతేకాకుండా… టికెట్ రేట్ రూ. 5వేలు వరకు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఈజీగా తీసుకునే పనిలేదు. ఇండిగో వారి పై కేసు పెడతాను’ అంటూ రోజా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది రోజాకి చిన్నపాటి సర్జెరీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టైములో ఆమె రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ కూడా తీసుకుంది. ఈ ఫ్లైట్ జర్నీ వల్ల ఈమె మరోసారి ప్రాణభయానికి గురైనట్టు తెలుస్తుంది.