Selvamani: రోజా భర్త సెల్వమణి సినీ రాజకీయాలు.. లేటెస్ట్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, మంత్రి అయిన రోజా అందరికీ సుపరిచితమే. రోజా మాత్రమే కాదు..ఆమె ఫ్యామిలీ మొత్తం ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.సెల్వమణి మాటలను బట్టి ఆయన తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించినట్టు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే.. ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయట.. ఇక నుండీ అలా చేయొద్దంటూ ఆయన అక్కడి సినీ జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

‘తమిళ సినీ కార్మికులకు పనులు ఉండటం లేదు.. ఇక్కడి పెద్ద పెద్ద హీరోలంతా హైదరాబాద్ , విశాఖల్లో షూటింగ్‌లు చేసుకుంటున్నారు. ఇదే విషయం పై రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోలు కూడా స్పందించారు.. తమిళ సినిమాల షూటింగ్‌లు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారు..అయితే అజిత్ దీని పై స్పందించాల్సి ఉంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా పేరు చెప్పుకుని కొంతకాలంగా తమిళంలో రూపొందే పెద్ద సినిమాలు ఎక్కువ శాతం హైదరాబాద్, విశాఖల్లో జరుగుతున్నాయి.

దాని ద్వారా ఇక్కడి ప్రభుత్వాలు ఆ పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు హైక్ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ‘ఫెప్సి’ అనే సినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న సెల్వమణికి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. అందుకే తమిళ సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం లేపేందుకు రెడీ అయ్యాడు. ఆంధ్రాలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజులుగా ఆమెతో కలిసి ఈయన ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ప్రముఖుల్ని కలుస్తూ వస్తున్నారు.

అలాంటి ఆయన ఇలాంటి రాజకీయాలు చేయడం ఏంటనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. సెల్వమణి కూడా ఓ దర్శకుడు అన్న సంగతి ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు. లొకేషన్లు అనేవి సినిమా కథని బట్టి ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మరి ఆ స్టేట్ లో షూటింగ్ వద్దు.. ఈ స్టేట్ లో షూటింగ్ వద్దు అని ఆయన అనడం ఏంటో..!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus