ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ‘పూరి కనెక్ట్స్’, ‘పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్’ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 29న విడుదల అయిన ఈచిత్రానికి యవరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. కానీ ముందు నుండీ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు భారీగా నిర్వహించడం.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేయించడం వంటివి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ నమోదయ్యేలా చేసాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు.
ఓసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 1.24 cr |
సీడెడ్ | 0.68 cr |
ఉత్తరాంధ్ర | 0.44 cr |
గుంటూరు | 0.28 cr |
ఈస్ట్ | 0.27 cr |
వెస్ట్ | 0.20 cr |
కృష్ణా | 0.24 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.10 Cr |
ఓవర్సీస్ | 0.08 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.70 cr |
‘రొమాంటిక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.4.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.96 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.0.72 కోట్ల షేర్ ను రాబట్టాలి.కొత్త సినిమాల ఎంట్రీతో ‘రొమాంటిక్’ కు ఎక్కువ థియేటర్లు లేవు కాబట్టి ఇక కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!