Ronth Movie Review in Telugu: రాంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దిలీష్ పోతన్, రోషన్ మేథ్యు (Hero)
  • NA (Heroine)
  • సజయ్ సెబాస్టియన్, కుమార్ దాస్ టిఎన్, సుధి కొప్ప (Cast)
  • షాహీ కబీర్ (Director)
  • రతీష్ అంబాట్ - వినీత్ జైన్ - ఈవీఎం రెంజిత్ - జోజో జోస్ (Producer)
  • అనిల్ జాన్సన్ (Music)
  • మనీష్ మాధవన్ (Cinematography)
  • మంగళాత్ ప్రవీణ్ (Editor)
  • Release Date : జూన్ 13, 2025
  • జంగ్లీ పిక్చర్స్ - ఫెస్టివల్ సినిమాస్ (Banner)

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హయ్యస్ట్ సక్సెస్ రేషియో ఉన్న ఇండస్ట్రీ మలయాళం. 2024లో మలయాళం ఇండస్ట్రీ క్రియేట్ చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. అదే స్పీడ్ ను 2025లోను కంటిన్యూ చేస్తుంది మలయాళం ఇండస్ట్రీ. ఆల్రెడీ “తుడరమ్, అలప్పుజ జింఖానా, రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, పడక్కలం” లాంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో మంచి సినిమా “రాంత్”. దిలీష్ పోతన్, రోషన్ మేథ్యు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం జూన్ 13న థియేటర్లలో విడుదలవ్వగా.. జూలై 21న హాట్ స్టార్ యాప్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎందుకని అస్సలు మిస్ అవ్వకూడదు అనేది చూద్దాం..!!

Ronth Movie Review in Telugu

కథ: ఎస్.ఐ యోహన్నాన్ (దిలీష్ పోతన్), సీపీఓ దిన్నత్ (రోషన్ మేథ్యు) కలిసి ఒక రాత్రి రెగ్యులర్ ప్యాట్రోలింగ్ కి వెళ్తారు. డ్యూటీలో భాగంగా కొన్ని కేసులు డీల్ చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఒక కేస్ వాళ్ళ జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేసింది? అనేది “రాంత్” కథాంశం.

నటీనటుల పనితీరు: మలయాళంలో సీనియర్ యాక్టర్ అయిన దిలీష్ పోతన్ ఈ సినిమాలో ఓ సీనియర్ & సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విధానం అలరిస్తుంది. మరీ ముఖ్యంగా భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు.

అలాగే.. దిన్నత్ గా నటించిన రోషన్ మెథ్యూ కూడా చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరి పాత్రలు చాలా భిన్నమైనవి, ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన మనస్తత్వం.. కానీ వీళ్ల కాంబినేషన్ నవ్విస్తుంది, బాధపెడుతుంది, ఏడిపిస్తుంది కూడా.

ఇక మిగతా పాత్రధారులందరూ మంచి నటనతో తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు షాహి కబీర్ ఈ కథను రాసుకున్న విధానమే పెద్ద ప్లస్ పాయింట్. బీభత్సమైన బ్యాక్ స్టోరీలు లేవు, భారీ బ్లాక్ లేదా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ లు సెట్ చేయలేదు. కేవలం.. ఇద్దరు పోలీసుల కథగా సినిమాని నడిపించిన విధానమే పెద్ద ప్లస్ పాయింట్. ఇద్దరి మనస్తత్వాలు ఏంటి, ఇద్దరి క్యారెక్టర్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేశాడు. అందువల్ల కథ ఒక ఫార్మాట్ లో వెళ్ళకపోయినా.. ప్రేక్షకులు పాత్రలతో ప్రయాణం చేస్తారు. దాంతో వాళ్ల భావాలను, భయాలను, ఆనందాన్ని ఆస్వాదిస్తారు. కామెడీ కూడా ఏదో ఇరికించినట్లుగా కాక చాలా ఆర్గానిక్ గా వర్కవుట్ అయ్యింది.

అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం కథ-కథనంలోకి ఆడియన్స్ ను విశేషంగా ఎంగేజ్ చేస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ ను ప్రేక్షకుల కళ్లకు ఇబ్బంది కలగకుండా మినిమల్ బ్రైట్ నెస్ తో తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక ఎడిటింగ్, కలరింగ్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ బాగా కుదిరాయి.

విశ్లేషణ: మాములుగా పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనేసరికి కుదిరితే పోలీసుల దాష్టీకాలను చూపించడం లేదా వాళ్లను విలన్లుగా పిక్చరైజ్ చేయడం తప్ప.. పోలీసుల జీవితాల్లోని చీకటి కోణాలను తెరపై చూపించే ప్రయత్నం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే దర్శకుడు షాహి కబీర్ “రాంత్” చిత్రంతో డ్యూటీ కోసం పోలీసులు చేసే త్యాగాలను, వాళ్లు వ్యక్తులుగా ఎదుర్కొనే సగటు ఇబ్బందులను, సిస్టమ్ లోని లూప్ హోల్స్ ను చాలా చక్కగా ఎవర్నీ ఇబ్బందిపెట్టకుండా తెరకెక్కించాడు. మరీ ముఖ్యంగా డ్రామాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. చెప్పాలంటే.. సినిమా కోర్ పాయింట్ ఏమిటి అనేది ఆఖరి నిమిషాల వరకు ఎవ్వరూ ఊహించలేరు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ తో ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసిన విధానం కూడా బాగుంది. ఓవరాల్ గా “రాంత్” మలయాళం నుండి వచ్చిన మరో మంచి సినిమా అని చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని కుటుంబ సభ్యులందరు కలిసి చూడొచ్చు.

ఫోకస్ పాయింట్: పోలీసుల జీవితాల్లో చీకటి కోణానికి చిత్రరూపం!

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus