అఖండ2 సినిమా రిలీజ్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమస్యలన్నీ క్లియర్ చేసుకుని డిసెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది అనే వార్తతో అందరు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే.. బాలయ్య అభిమానుల ఆనందం, కొంతమందికి మాత్రం బాధను మిగుల్చుతుంది. డిసెంబర్ 12న తమ సినిమాలను విడుదల చేసుకొనేందుకు ప్రమోట్ చేసుకున్న “మోగ్లీ, సైక్ సిద్ధార్థ, ఈషా” వంటి సినిమాల విడుదలలు ప్రస్తుతం ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాయి.
“సైక్ సిద్ధార్థ”కి సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ ఉంది, వాళ్ల టార్గెట్ కూడా లిమిటెడ్ రిలీజ్ కాబట్టి.. నందు & టీమ్ కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నా.. వేరే దారిలేక రంగంలోకి దిగుతున్నారు. అయితే.. “మోగ్లీ” టీమ్ మాత్రం ఇప్పుడేం చేయాలో తోచక మిన్నకుండిపోయారు. ఇప్పటికే ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి.. డిసెంబర్ లో 12 కాకుండా మరో తేదీ కూడా వాళ్లకి అనుకూలంగా లేదు. దాంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రిలీజ్ కి స్కోప్ లేకుండా పోయింది. దాంతో దర్శకుడు సందీప్ రాజ్ పెట్టిన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

ఇకపోతే.. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంత త్వరగా సెట్ అవ్వకపోతే డిసెంబర్ 25కి “అఖండ 2” రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. అప్పుడు ఆ డేట్ ను నమ్ముకుని ఉన్న మేకర్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యేవారు. మరీ ముఖ్యంగా డిసెంబర్ 25న విడుదల డేట్ ను అందరికంటే ముందుగా బ్లాక్ చేసుకున్న రోషన్ మేక “చాంపియన్” కూడా ఇబ్బందిపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గండం తప్పడంతో.. రోషన్ మేక సేఫ్ అయ్యాడు కానీ.. రోషన్ కనకాల మాత్రం బుక్కయ్యాడు. మరి బాలయ్య కానీ 14 రీల్స్ సంస్థ కానీ ఈ విషయంలో నష్టపోయిన, పోతున్న సినిమా బృందాలకి ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారో చూడాలి.
