తేజ సజ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ‘రాజకుమారుడు’ ‘కలిసుందాం రా’ ‘చూడాలని వుంది’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా మారి అద్భుతాలు చేసిన సందర్భాలు ఎక్కువ లేవు. తరుణ్ వంటి వారి విషయంలో తప్ప మిగిలిన హీరోల విషయంలో ఇలాంటివి జరిగింది లేదు. తరుణ్ కు కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి..నిలబడగలిగాడు.
అయితే తేజ సజ్జ మాత్రం సొంత టాలెంట్ తోనే స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అతను పాన్ ఇండియా హీరో. తన నెక్స్ట్ సినిమాలకి కూడా పాన్ ఇండియా మార్కెట్ బిజినెస్ విషయంలో హెల్ప్ అవుతుంది. కానీ అతనిలా సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల కానీ, పూరీ కొడుకు ఆకాష్ కానీ క్లిక్ అయ్యింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి శ్రీకాంత్ కొడుకు రోషన్ పై పడింది.

‘రుద్రమదేవి’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అతను ‘పెళ్ళిసందD’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. రోషన్ లుక్స్ కి, డాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా బాగా చేశాడు. సో డెబ్యూ మూవీతో పాస్ మార్కులు వేయించుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఈ డిసెంబర్ 25న ‘ఛాంపియన్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించాయి. రోషన్ లుక్ కూడా బాగుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే మంచి వసూళ్లు వస్తాయి. అయితే తేజ సజ్జా మాదిరి ఇతను కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్లు కొట్టి మార్కెట్ ఏర్పరుచుకుంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
