‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కొడుకు ఆశీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ వంటివి యూత్ ను బాగానే ఆకట్టుకున్నాయి.ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ చిత్రం పై ఫోకస్ బానే పడింది. దాంతో సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించేలా నమోదయ్యాయి.టాక్ కూడా యవరేజ్ అనే విధంగా వచ్చింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం ఆకర్షించలేకపోయింది. దాంతో వీకెండ్ తర్వాత ఈ చిత్రం పెర్ఫార్మన్స్ బాగా డల్ గా ఉంది.
ఓసారి 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 1.19 cr |
సీడెడ్ | 0.56 cr |
ఆంధ్రా(టోటల్) | 1.25 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 3 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.05 cr |
ఓవర్సీస్ | 0.09 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 3.14 cr |
‘రౌడీ బాయ్స్’ చిత్రానికి రూ.9.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ యవరేజ్ గా ఉండడంతో 4 రోజులకి ఈ చిత్రం రూ.3.14 కోట్ల షేర్ ను నమోదు చేసింది.వీకెండ్ తర్వాత ఈ చిత్రం చాలా వరకు డ్రాప్ అయిపోయింది.
నిర్మాత బలవంతంగా కొన్ని థియేటర్లను హోల్డ్ చేసాడు కానీ.. అక్కడ డెఫిసిట్ లు(నెగిటివ్ షేర్స్) పడుతున్నాయి. రెండో వీకెండ్ వరకు చిత్రాన్ని నడిపించాలనే ఆశేమో..! ఇక బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.6.86 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!