కొంతమంది దర్శకులకు కొంతమంది బ్రాండ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. రాజమౌళికి కీరవాణి, సుకుమార్ కు దేవి శ్రీ ప్రసాద్ లా అన్న మాట. అదే రీతిగా గతంలో దర్శకుడు తేజకి ఆర్.పి.పట్నాయక్ ఉండేవాడు.రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీకోసం’ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆర్.పి. అటు తర్వాత వరుసగా తేజ డైరెక్ట్ చేసిన ‘చిత్రం’ ‘ఫ్యామిలీ సర్కస్’ ‘నువ్వు నేను’ ‘జయం’ ‘నిజం’ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు.
అయితే మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజం’ మూవీలో ఇతను 7 పాటల వరకు పాడాడు ఆర్.పి. అలా పాడటం.. చాలా పెద్ద తప్పు అంటూ ఇటీవల ఇతను చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ” ‘నిజం’ మూవీలో నేను పాటలు పాడి పెద్ద తప్పు చేశాను. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పలేదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి నా వాయిస్ సెట్ అవ్వలేదు. ఆ విషయంలో నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంటాను.
అంతేకాకుండా ఈ మూవీ తర్వాత సినిమాల్లో పాటలు పాడడం మానెయ్యమని నాకు చాలా మంది చెప్పారు” అంటూ చెప్పుకొచ్చాడు.’ఒక్కడు’ మూవీతో మహేష్ రేంజ్ పెరగడంతో ‘నిజం’ మూవీ ఆడలేదు అని దర్శకుడు తేజ ఇప్పటికీ చెబుతుంటాడు. ఆర్.పి.పట్నాయక్ కూడా అదే విషయాన్ని ఇంకో కోణంలో చెప్పుకొచ్చాడు అంతే.