భీమ్ స్టోరీకి ముస్లిం గెటప్ కి సంబంధం ఉండదట!

  • October 28, 2020 / 06:48 PM IST

స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా ఎన్టీఆర్ పోషించిన భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ టీజర్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కొమరం భీమ్ పాత్ర పోషించిన హీరో ఎన్టీఆర్ ఇందులో ముస్లిం టోపీ ధరించి కనిపించడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే ఆదివాసీలు, కొమరం భీమ్ వారసులు దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు.

బీజేపీ నాయకులు సైతం ఈ విషయంలో రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ వివాదంపై స్పందించిన రాజమౌళి టీమ్ ఏం చెబుతుందంటే.. ఈ టీజర్ లో ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో చూపించినదానికి, కొమరం భీమ్ కథకు సంబంధం ఉండదని.. టీజర్ ని చూసి ఓ అంచనాకు రావడం కరెక్ట్ కాదని.. సినిమా మొత్తం చూస్తే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. టాలీవుడ్ లో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.

ముఖ్యంగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని జక్కన్న కూడా తన సినిమాలకు సంబంధించి కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘బాహుబలి’ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇలానే ఓ వివాదం తలెత్తింది. కర్ణాటకకు చెందిన ఓ వర్గం వారు టైటిల్ మార్చాలని డిమాండ్ చేశారు. కానీ జక్కన్న అన్నీ ఎదుర్కొని సినిమాను విడుదల చేశారు. ఈసారి కూడా అలానే జరుగుతుందేమో చూడాలి!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus