RRR Teaser: ఆర్ఆర్ఆర్ మేకర్స్ చేస్తున్న తప్పు ఇదేనా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి భారీ అంచనాలతో మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు, విదేశాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 45 సెకన్ల గ్లింప్స్ తో రాజమౌళి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు హాలీవుడ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ ఉండబోతుందని ప్రేక్షకులకు తెలిసేలా చేశారు.

అయితే ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ కొత్త రికార్డులను క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ 24 గంటలలో 12.44 మిలియన్ల వ్యూస్ ను సాధించడంతో పాటు 987.7k లైక్స్ ను సాధించింది. లైక్స్ పరంగా తొలి స్థానంలో అజిత్ వాలిమై ఉండగా రెండో స్థానంలో భీమ్లా నాయక్ ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండటం గమనార్హం. మరోవైపు కేజీఎఫ్ ఛాప్టర్2 టీజర్ రికార్డులతో పోలిస్తే ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ఎక్కువ వ్యూస్ సాధించలేదు.

రాధేశ్యామ్ ఇంట్రో టీజర్ తో పోలిస్తే కూడా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ వ్యూస్ తక్కువ కావడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మేకర్స్ గ్లింప్స్ కు సంబంధించిన ప్రకటన చేసిన తక్కువ సమయంలోనే గ్లింప్స్ ను రిలీజ్ చేయడంతో అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ రికార్డులు క్రియేట్ చేయకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుందని ఆర్ఆర్ఆర్ తో కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus