టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఈ సినిమా 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడంతో పాటు అన్ని ఏరియాల్లో కూడా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయింది. థర్డ్ వీకెండ్ లో కూడా ఈ సినిమా అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది. బీస్ట్, కేజీఎఫ్2 సినిమాలు విడుదలైనా ఆర్ఆర్ఆర్ హవా ఆగదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం పడుతుందని కామెంట్లు వినిపించాయి.
ఐపీఎల్ వల్ల ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఐపీఎల్ పై ఆర్ఆర్ఆర్ ప్రభావం పడింది. ట్రిపుల్ ఆర్ హీరోలే రివర్స్ లో ఐపీఎల్ నిర్వాహకులకు భారీ షాకిచ్చారు. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న సీన్ రివర్స్ చేశారనే చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ మ్యాచ్ కు ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్ మహారాష్ట్రలో జరుగుతుండటం కూడా ఈ మ్యాచ్ లపై క్రికెట్ లవర్స్ లో ఒకింత ఆసక్తి తగ్గింది.
ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుండగా స్టేడియంలలో మ్యాచ్ లు చూడటానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. స్టేడియంకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గడంతో ఐపీఎల్ నిర్వాహకులు సైతం కంగారు పడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లకు గతంతో పోలిస్తే టీఆర్పీ తగ్గిందని సమాచారం అందుతోంది. ఐపీఎల్ మ్యాచ్ లపై పూర్తిస్థాయిలో కాకపోయినా ఆర్ఆర్ఆర్ ప్రభావం కొంతమేర పడిందనే చెప్పాలి. వీక్ డేస్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గుతున్నా వీకెండ్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. రాజమౌళి సినిమాసినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ ఉండటం గమనార్హం.