RRR Collections: జపాన్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ బిగ్ ఫెయిల్యూరా..?

  • November 3, 2022 / 12:10 AM IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 21న జపాన్ లో రిలీజ్ అయ్యింది. జపాన్ వెర్షన్ కోసం రాజమౌళి- ఎన్టీఆర్- రాంచరణ్ లు అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ టీం సభ్యులు జపాన్ వెళ్లి ప్రమోషన్స్ చేసొచ్చారు. ఇందుకోసం ‘ఆర్.ఆర్.ఆర్’ టీం భారీగా ఖర్చు చేసింది. జపాన్ లో రాజమౌళి సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంది.

ఎన్టీఆర్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.! ‘నాటు నాటు’ పాటకి అక్కడి జనాలు ఉత్సాహంతో చిందులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాని అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాలని చిత్ర బృందం తెగ ట్రై చేసింది. అయితే వారి ప్రయత్నం వృధా కాలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 400 మిలియన్ యెన్ (అక్కడి కరెన్సీ) ల టార్గెట్ సాధిస్తే అక్కడ సక్సెస్ అయినట్టు.

బిజినెస్ అంత జరిగినా జరగకపోయినా.. రాజమౌళి ఇమేజ్ ను బట్టి ఈ మూవీ అక్కడ అంత మొత్తం కలెక్ట్ చెయ్యాలి. అక్కడ ఒక్క యెన్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 0.56 రూపాయలు . మొదట అక్కడి బాక్సాఫీస్ వద్ద తడబడినా.. సైలెంట్ గా గ్రోత్ ను చూపించింది ఈ చిత్రం.కానీ ఇప్పటివరకు జపాన్లో ఈ చిత్రం 740 K యెన్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ పండితుల సమాచారం.

ఇప్పటివరకు అక్కడ ‘ముత్తు’ 400 మిలియన్ యెన్లు, ‘బాహుబలి’ 365 మిలియన్ యెన్లు, త్రీ ఇడియట్స్ 149 మిలియన్ యెన్లు కలెక్ట్ చేశాయి. ఆ రేంజ్లో ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్ట్ చేయడం కష్టంగానే కనిపిస్తుంది. కాబట్టి జపాన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యంగానే కనిపిస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus