రాజమౌళి.. రికార్డులు.. ఈ రెండింటికీ చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన సినిమా తీస్తే రికార్డులు బద్దలవుతాయి. రికార్డులు ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటాయి అని అంటుంటారు. తాజాగా ఆయన నుండి వచ్చిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. తారక్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ దక్కించుకుంది. సుమారు రూ. 1200 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. ఇదంతా బాక్సాఫీసు దగ్గర జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీల్లోనూ ‘ఆర్‌ఆర్ఆర్’ హవా కొనసాగుతోంది.
మరోవైపు రేటింగ్ వెబ్‌సైట్లలోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ దూసుకుపోతోంది. సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే ప్రముఖ వెబ్‌సైట్ రోటెన్ టమోటాస్‌లో ‘ఆర్‌ఆర్ఆర్’ ఓ ఘనత సాధించింది. 2022కిగాను ఉత్తమ చిత్రాల జాబితాలో 46వ స్థానంలో నిలిచింది రాజమౌళి చిత్రం. తారక్ – చరణ్‌ల స్నేహబంధానికి 91 శాతం క్రిటిక్స్ రేటింగ్స్ రాగా, 94 శాతం ఆడియన్స్ రేటింగ్స్ వచ్చాయట. దీంతో ఈ సినిమా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ను దాటేసినట్లయింది. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’కు 94 శాతం క్రిటిక్స్ రేటింగ్ 94 శాతం ఉండగా, ఆడియన్స్ రేటింగ్ 90 శాతం.
ఈ లెక్కన ‘అవెంజర్స్..’పై ‘ఆర్‌ఆర్‌ఆర్’ దే పై చేయి అయ్యింది. ‘ఆర్ఆర్‌ఆర్’ థియేటర్లలో విడుదలైనప్పుడు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే. సినిమా బాగున్నా, భారీగా ఉన్నా.. ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది అని కామెంట్లు వినిపించాయి. దీంతో సినిమాకు భారీ వసూళ్లు కష్టం అనుకున్నారు. అదే సమయంలో టికెట్ రేట్లు భారీగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు అంతగా కనెక్ట్ అవ్వలేదని కూడా అంచనాలేశారు.
అయితే సినిమా ఓటీటీకి వచ్చాక చూసేవాళ్లు, ఆదరించే వాళ్ల సంఖ్య బాగా పెరిగిందట. ఈ క్రమంలో ఇంత మంచి రేటింగ్ అని చెబుతున్నారు. మరోవైపు ఓటీటీల వల్ల ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తోంది. అయినప్పటికీ చిత్రబృందం విదేశీ విడుదల గురించి ఆలోచిచండం లేదు. మన సినిమాలకు చైనాలో మంచి ఆదరణే ఉంది. కానీ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి అలాంటి ఆలోచన చేయకపోవడం గమనార్హం.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!