టికెట్ రేట్ల ఇష్యు, ఒమిక్రాన్ ఇష్యు అనేవి లేకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రేపు విడుదలయ్యి ఉండేది. కానీ ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ న్యూ ఇయర్ రోజున అధికారిక ప్రకటన ఇచ్చారు. అదేదో ముందే ప్రకటించి ఉంటే.. ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కనీసం ఒక నెల రోజుల ముందు చెప్పినా.. ‘సర్కారు వారి పాట’ కూడా రెడీ అయ్యేది. వీటి గురించే ఎందుకు చెబుతున్నాడు.. ‘ఆచార్య’ కూడా విడుదలయ్యి ఉండొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు.
దానికి ఒక షరతు పెట్టాడు రాజమౌళి. ‘ఆర్.ఆర్.ఆర్’ లో రాంచరణ్ నటిస్తున్నాడు కాబట్టి.. ‘ఆచార్య’ లో కూడా చరణ్ నటిస్తున్నాడు కాబట్టి.. ముందుగా ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయ్యాకే ‘ఆచార్య’ ని విడుదల చెయ్యాలి అనేది ఆ కండిషన్. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్ట్ పోన్ అయ్యింది కాబట్టి ‘ఆచార్య’ ని కూడా పోస్టుపోన్ చెయ్యాల్సిందే. అయితే గత ఏడాది.. ‘ఆచార్య’ ని మే 13న విడుదల చేయబోతున్నట్టు… ‘ఆర్.ఆర్.ఆర్’ ను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
మరి దాని సంగతి ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. అప్పటికి ‘ఆచార్య’ ని తెలుగులో మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కాబట్టి.. అందుకు రాజమౌళి అభ్యంతరం తెలుపలేదు. కానీ ఈసారి మాత్రం ‘ఆచార్య’ ని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. ఇప్పుడు ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ ని రిలీజ్ చేస్తే.. హిందీ లేకుండా చెయ్యాలి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల ఇష్యు, 50 శాతం అక్యుపెన్సీ తో మాత్రమే థియేటర్లు రన్ అవుతున్నాయి… కాబట్టి ఇక్కడ ‘ఆచార్య’ కి కలెక్షన్లు రావడం కష్టం.అందుకోసం ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయ్యే వరకు ‘ఆచార్య’ వెయిట్ చెయ్యాల్సిందే.