రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఆంధ్ర హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు నైజాం హక్కులు 70 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. సీడెడ్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమాకు జరగని స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాకు బిజినెస్ జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే మాత్రమే బయ్యర్లకు భారీగా లాభాలు మిగులుతాయి. అయితే ఈ సినిమా వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిందనే సంగతి తెలిసిందే. రాజమౌళి వేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని భావించగా కరోనా వల్ల జక్కన్న ప్రణాళికలు మారిపోయాయి.
అయితే చాలారోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అడ్వాన్స్ లు ఇచ్చిన బయ్యర్లకు కరోనా వల్ల వడ్డీల భారం పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించినా ఏపీలో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు. అందువల్ల ఆర్ఆర్ఆర్ మూవీ ఆంధ్ర బయ్యర్లు 20 శాతం డిస్కౌంట్ అడిగారని సమాచారం. అయితే కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ నిర్మాతకు సైతం లాభాలు తగ్గాయి. ఆర్ఆర్ఆర్ బయ్యర్లు డిస్కౌంట్లు అడుగుతూ నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ బయ్యర్ల డిమాండ్ విషయంలో నిర్మాత ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు భారీగా పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వకపోతే మాత్రం బయ్యర్ల డిమాండ్ విషయంలో నిర్మాత ఆలోచించాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్లు కావడం గమనార్హం. హీరోల కంటే దర్శకుడు రాజమౌళికే ఎక్కువమొత్తం రెమ్యునరేషన్ గా దక్కిందని తెలుస్తోంది.