2021 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు దేశంలోని సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనే సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఆర్ఆర్ఆర్ హక్కులు ఏకంగా 900 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. బాహుబలి 2 సినిమాతో పోలిస్తే దాదాపు రెట్టింపు మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులు అమ్ముడవడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హక్కులు 240 కోట్ల రూపాయలకు అమ్ముడవగా బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఆర్ఆర్ఆర్ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులతో పాటు భారతీయ భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ డీల్ విలువ 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని సమాచారం. ఆర్ఆర్ఆర్ తమిళనాడు, కర్ణాటక, కేరళ థియేట్రికల్ హక్కులు 108 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 70 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం. ఇతర దేశాల హక్కులు కూడా కలిపితే ఆర్ఆర్ఆర్ నిర్మాతకు రిలీజ్ కు ముందే 900 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఏ తెలుగు సినిమా ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు.
రాజమౌళి సినిమా అంటే ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని భావించి డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విడుదలకు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. చరణ్, ఎన్టీఆర్ కెరీర్ లలో ఆర్ఆర్ఆర్ చిత్రం మరపురాని చిత్రంగా నిలిచిపోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!