RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు అక్కడ క్రేజ్ తగ్గలేదుగా.. ఏం జరిగిందంటే?

2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ హిట్లలో ఆర్ఆర్ఆర్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా మన దేశంతో పాటు విదేశాల్లో సైతం సంచలనాలు సృష్టించింది. చరణ్, తారక్ రేంజ్, మార్కెట్ ను ఈ సినిమా పెంచింది. ప్రస్తుతం ఈ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. క్రేజీ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఈ సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం. జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఆ దేశంలో ఈ సినిమా రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం జనవరి 5న సరికొత్త ఐమ్యక్స్ ప్రింట్లతో అక్కడ ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసిందని తెలుస్తోంది. అందువల్లే ఈ సినిమాకు అక్కడ రీరిలీజ్ చేసే స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ రీరిలీజ్ కు సైతం బుకింగ్స్ విషయంలో అక్కడ మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది.

ఈ విషయం తెలిసిన నెటిజన్లు సాహోరే జక్కన్న అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలుకానుండగా (RRR) ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

మహేశ్ రాజమౌళి కాంబో మూవీకి బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేవని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా అటు మహేశ్ ఇటు జక్కన్న కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus