RRR Movie Glimpse: 45 సెకండ్లకే విజువల్ వండర్ ను చూపించిన ‘ఆర్.ఆర్.ఆర్’ గ్లిమ్ప్స్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్.ఆర్.ఆర్’. రాంచరణ్, ఎన్టీఆర్ వంటి బడా స్టార్లు నటిస్తున్న ఈ బడా మల్టీస్టారర్ చిత్రం…. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతుంది.అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. చరణ్ సరసన బాలివుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్,ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారు.అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక నవంబర్ నుండీ ప్రచార కార్యక్రమాలను కూడా షురూ చేయాలని ‘ఆర్.ఆర్.ఆర్’ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా దీపావళి కానుకగా ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ 45సెకండ్ల గ్లిమ్ప్స్ ను ఈరోజు అనగా నవంబర్ 1 న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. వారు ప్రకటించినట్టుగానే కొద్దిసేపటి క్రితం గ్లిమ్ప్స్ విడుదలయ్యింది. ముందుగా మేకర్స్ ప్రకటించినట్టుగానే ఈ గ్లిమ్ప్స్ లో ఎటువంటి డైలాగులు లేవు. కానీ గూజ్ బంప్స్ తెప్పించే అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఓ పులితో ఫైట్ చేస్తున్నట్టు, రాంచరణ్ గుర్రపు స్వారీ చేస్తున్నట్టు, అజయ్ దేవగన్ ఓ బ్రిటిష్ వ్యక్తిని తుపాకీతో కలుస్తున్నట్టు.. చూపించారు.

అలాగే అలియా భట్, ఒలివియా మోరిస్ లు కూడా కనిపించారు.రాహుల్ రామకృష్ణ, శ్రీయ వంటి వారు కూడా కనిపించారు.చరణ్ బ్రిటీష్ డ్రెస్ లో అలాగే పోలీస్ డ్రెస్ లో కూడా కనిపిస్తున్నాడు.ఇక ఓపెనింగ్ లో కొమరం భీం(ఎన్టీఆర్) కంట నెత్తురు..అల్లూరి సీతారామరాజు (రాంచరణ్) కంట నిప్పు అన్నట్టు ఓ విజువల్ ఉండగా.. చివర్లో ఎన్టీఆర్ నీటిని, చరణ్ నిప్పుని పట్టుకుంటున్నట్టు మరో విజువల్ ఉంది. చివర్లో ఓ పులి బ్రిటీష్ వ్యక్తి పైకి దూకిన విజువల్ అయితే హైలెట్ అని చెప్పాలి. ఇండియన్ సినిమాకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆర్.ఆర్.ఆర్’ 2022 జనవరి 7 న సంక్రాంతి కానుకగా తీసుకురాబోతున్నట్టు ఈ గ్లిమ్ప్స్ ద్వారా ఖరారు చేశారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus