‘బాహుబలి ది బిగినింగ్’ తో హిందీ ప్రేక్షకులను కూడా అలరించి తన వైపుకి తిప్పుకున్నాడు రాజమౌళి. ‘బాహుబలి ది బిగినింగ్’ సృష్టించిన రికార్డులను ‘బాహుబలి2’ తో తనే బ్రేక్ చేసాడు. అటు తర్వాత ఆ రికార్డుని తన ‘ఆర్.ఆర్.ఆర్’ తో బ్రేక్ చేస్తాడు అనుకుంటే.. రిజల్ట్ తేడా కొట్టింది. ‘బాహుబలి2’ అక్కడ మొదటి రోజు రూ.41 కోట్ల నెట్ ను కలెక్ట్ చేసింది. అయితే నిన్న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ కేవలం రూ.19 కోట్ల నెట్ కలెక్షన్లను మాత్రమే రాబట్టిందని తెలుస్తుంది.
ఈ రకంగా చూసుకుంటే ‘ఆర్.ఆర్.ఆర్’.. ‘బాహుబలి2’ నే కాదు ప్రభాస్ ‘సాహో’ రికార్డుని కూడా కొట్టలేకపోయింది. ‘సాహో’ చిత్రం అక్కడ మొదటి రోజు రూ.25 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను సాధించింది. దాని కంటే ‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి రోజు కలెక్షన్లు తక్కువగా ఉండడం గమనార్హం. ‘ఆర్.ఆర్.ఆర్’ హిందీలో డే1 రికార్డ్ కొట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మధ్యనే అక్కడ ‘కశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రం విడుదలై ఇప్పటికే బ్లాక్ బస్టర్ కలెక్షన్లను నమోదు చేయడం
ఒకటి అయితే పోటీగా అక్షయ్ కుమార్ నటించిన మరో పెద్ద సినిమా ‘బచ్పన్ పాండే’ ఉండడం కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు. అయితే మొదటి రోజుతో సమానంగా రెండో రోజు కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ బుకింగ్స్ జరిగాయి.ఈవెనింగ్ కు మొదటి రోజుని మించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.అక్కడ కూడా టాక్ కొంత మిక్స్డ్ గా ఉన్నప్పటికీ ఈ రేంజ్లో బుకింగ్స్ జరగడం అంటే మాములు విషయం కాదు.
‘కె.జి.ఎఫ్’ ‘పుష్ప’ వంటి చిత్రాలు మొదటి రోజు అక్కడ అద్భుతాలు చేసింది ఏమీ లేదు. కానీ ఫుల్ రన్లో అవి అద్భుతాలు చేసాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ కు కూడా అలాంటి సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందేమో..!