ఈ మధ్య కాలంలో రిలీజ్ సమయంలో ఏ సినిమాకు రాని స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆవాంతరాలు ఎదురయ్యాయి. మొదట షూటింగ్ ఆలస్యం కావడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్లు మారగా కరోనా థర్డ్ వేవ్ వల్ల ఈ ఏడాది జనవరి నెల 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదలకు ఆరు రోజుల ముందు వాయిదా పడింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఆర్ఆర్ఆర్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28వ తేదీన రిలీజవుతుందని ప్రకటించారు.
అయితే మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయడానికి కర్ణాటకలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో మేకర్స్ మార్చి 25వ తేదీకి ఫిక్స్ అయ్యారు. ప్రతి సంవత్సరం మార్చి 25వ తేదీనాటికి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యేవి. అయితే కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఆలస్యంగా జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షలు ముఖ్యం కాబట్టి ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో సినిమాపై ఆసక్తి చూపకపోవచ్చు.
మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ లు గతంలో పలు సినిమాల కలెక్షన్లపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలోనే ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారమయ్యే అవకాశం ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు అమల్లోకి వస్తాయి. తమ సినిమాలకు సమ్మర్ అడ్వాంటేజ్ ప్లస్ అవుతుందని ఆర్ఆర్ఆర్ మేకర్స్ అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పరీక్షలు, ఐపీఎల్ లాంటి సమస్యలను అధిగమించటం కష్టమేమీ కాదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
మార్చి 27వ తేదీన చరణ్ పుట్టినరోజు కాగా ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్ పుట్టినరోజు సంబరాలను జరుపుకుంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరగడంతో పాటు ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం ఉండనుంది. ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనే విషయంలో సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!