బాహుబలి సినిమా అనంతరం దర్శకుడు రాజమౌళి అంతకుమించి అనేలా ఉండాలి అని ఆర్ఆర్ఆర్ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య 450 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సినిమాకు ఆ తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ అయినట్లుగా కూడా తెలియజేశారు. దాదాపు 550 కోట్ల వరకు కూడా ప్రొడక్షన్ కాస్ట్ అయినట్లుగా రాజమౌళి ఇటీవల వివరణ ఇచ్చాడు 850 కోట్ల వరకు బిజినెస్ కావడంతో అక్కడి దాదాపు పెట్టిన పెట్టుబడి దానికి వచ్చినట్లుగా చెప్పారు
ఒక విధంగా సినిమా అయితే అన్ని రకాలుగా మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద కాస్త హిట్ అయినా కూడా నిర్మాతకు మంచి లాభాలు వచ్చినట్లే. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రొడక్షన్ విషయంలో కూడా ఇటీవల దర్శకుడు వివరణ ఇచ్చాడు. సాధారణంగా హీరోలు ఎవరైనా సరే కాస్త రెస్ట్ తీసుకోవాలి అని అనారోగ్య కారణాలు చెప్పినప్పటికీ రాజమౌళి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా వారిని తప్పకుండా ప్లాన్ ప్రకారం సినిమా షూటింగ్ రావాల్సిందే అని చెప్పాడట.
రామ్ చరణ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒకరోజు తలనొప్పిగా ఉంది అని చెప్పగానే ఇక్కడ వెయ్యి మంది వెయిట్ చేస్తున్నారు నువ్వు త్వరగా రావాలి అని రాజమౌళి చెప్పినట్లు గుర్తు చేశాడు.మీపై సానుభూతి చూపిస్తే మళ్లీ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది అని రాజమౌళి కూడా సమాధానం ఇచ్చాడు. దాదాపు ఒక రోజు షూటింగ్ కు 50 లక్షలు ఖర్చు అవుతుంది.
అంటే ప్రతి షాట్ కూడా ఐదు లక్షల వరకు స్పెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను మీ పై సానుభూతి చూపించి రెస్ట్ ఇవ్వడం జరిగితే మళ్ళీ నాలో బడ్జెట్ టెన్షన్ పెరిగిపోతుంది అని రాజమౌళి రామ్ చరణ్ కు జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిచ్చాడట. ఇక రాజమౌళికి తగ్గట్టుగా ఇద్దరు స్టార్స్ కూడా హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.