మూడు గంటల నిడివి ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ రిజల్ట్ విషయంలో ప్రేక్షకులకు ఏ మాత్రం సందేహాలు లేవు. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కథ, కథనానికి సంబంధించి చాలా విషయాల్లో క్లారిటీ లేకపోవడంతో రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై ఏం చూపించబోతున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ లేవని తెలుస్తోంది.
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు పెయిడ్ ప్రీమియర్ల విషయంలో వెనక్కు తగ్గినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ సినిమా టికెట్ రేట్లను మరింత పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వ్యులు జారీ చేయడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్లు కళ్లు చెదిరే స్థాయిలో ఉండనున్నాయి. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు టికెట్ రేట్లతో సంబంధం లేకుండా ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ పెయిడ్ ప్రీమియర్స్ లేకపోయినా హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోలు పడతాయని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం కూకట్ పల్లిలో ఉన్న అర్జున్, విశ్వనాథ్, మల్లిఖార్జున, భ్రమరాంబ థియేటర్లలో బోరబండలోని విజేత, మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్పెషల్ షోలకు సంబంధించిన హక్కులను ఇన్నామురి గోపీచంద్ అనే డిస్ట్రిబ్యూటర్ కు ఇచ్చారని తెలుస్తోంది. హిందీలో, ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. చరణ్, తారక్ నాలుగేళ్ల కష్టానికి తగిన ఫలితం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.