RRR Movie: ఆ కంపెనీలకు భారీ లాభాలను అందించిన ఆర్ఆర్ఆర్!

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలలో చాలా సినిమాలు ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించినా వీకెండ్ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. పెద్ద సినిమాలలో చాలా సినిమాలకు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం వీక్ డేస్ లో కూడా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన వాళ్లకు భారీ లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Click Here To Watch NOW

తొలి వారం కలెక్షన్లతో ఆర్ఆర్ఆర్ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు 80 శాతానికి పైగా రికవరీ అయింది. ఎన్టీఆర్, చరణ్ కెరీర్ లలో ఈ సినిమా ప్రత్యేక సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమాకు 391 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ మల్టీప్లెక్స్ కంపెనీలకు కూడా ఒక విధంగా ప్లస్ అయింది. పీవీఆర్, ఐనాక్స్ షేర్లను కొనుగోలు చేసిన వాళ్లకు కొన్ని రోజుల్లోనే భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందు పీవీఆర్ షేర్ ధర 1,776.55 రూపాయలుగా ఉండగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజున షేర్ ధర రూ.1,821.65గా ఉంది. నిన్నటికి పీవీఆర్ షేరు ధర రూ.1,876గా ఉండటం గమనార్హం. మల్టీప్లెక్స్ ఐనాక్స్ తాజాగా పీవీఆర్ లో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ విలీనం వల్ల మల్టీప్లెక్స్ ఐనాక్స్ షేర్లు కూడా అంచనాలకు మించి పెరిగాయి. మల్టీప్లెక్స్ ఐనాక్స్ ఒక్కో షేరు ధర ఏకంగా 69 రూపాయలు పెరిగిందని సమాచారం అందుతోంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఈ కంపెనీలకు ప్లస్ అయింది. రాబోయే రోజుల్లో రిలీజయ్యే సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే ఈ షేర్ల విలువ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో కేజీఎఫ్2 సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే మల్టీప్లెక్స్ కంపెనీలకు ప్లస్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus