‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను థియేటర్లలోనే చూస్తే బాగుంటుంది. గ్లింప్స్, టీజర్, ట్రైలర్… ఇలా ప్రమోషనల్ వీడియోలు చూసిన ప్రతిఒక్రరూ ఇదే మాట అంటున్నారు. అయితే ఓటీటీలో సినిమా చూసేద్దాం… థియేటర్లకు వెళ్లాలా? అని అనుకునే ఓటీటీయన్లకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ పెద్ద షాక్ ఇచ్చింది. సినిమా ఇంత త్వరగా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే… ‘ఆర్‌ఆర్‌ఆర్’ జనవరి 7న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
మామూలుగా అయితే స్టార్ హీరోల సినిమాలు విడుదలైన మూడు, నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి ప్రథమార్ధంలో ఓటీటీ లోకి వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ను హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ మూవీస్ జయంతిలాల్ గడా షాక్ ఇచ్చారు. సినిమాను విడుదలైన 75-90 రోజులకు ఓటీటీలోకి, టీవీల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు కేవలం ఏదో టీవీ ఛానల్‌కి ఇచ్చే ఉద్దేశం లేదని,
అన్ని ఛానల్స్‌లోనూ సినిమా చూసేలా డిజిటల్ డీల్ కుదుర్చుకున్నామని జయంతిలాల్ చెప్పుకొచ్చారు. దీని వల్ల సినిమాను అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే డిజిటల్‌లోకి సినిమా ఆలస్యం ఎందుకు అంటే… అప్పటివరకు థియేటర్లలో సినిమా కొనసాగుతుంది కాబట్టే అని చెప్పుకొచ్చారు. ఓటీటీ యుగంలో ఇలాంటి నిర్ణయం కాస్త ఆశ్చర్యపరిచేదే.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!