RRR Movie: టెలివిజన్ ప్రీమియర్ గా ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసింది. ఇలా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలకు జీ5 సొంతం చేసుకుంది.

ఇలా డిజిటల్ స్క్రీన్ పై కూడా అత్యధిక రికార్డులు సృష్టించిన ఈ సినిమా త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో ద్వారా త్వరలోనే ఈ సినిమా త్వరలోనే ప్రసారం కానుందని తెలుస్తుంది అయితే ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయం మాత్రం ప్రకటించలేదు

ఈ సినిమానే వినాయక చవితి సందర్భంగా ఈ నెల చివరిలో విడుదల చేయనున్నట్లు భావిస్తున్నారు. ఇకపోతే ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రాంచరణ్ అల్లూరి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ అజయ్ దేవగన్ వంటి తదితరులు కూడా నటించారు.

చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటారో జక్కన్న ఈ సినిమా ద్వారా చూపించారు.ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుందని తెలియడంతో అభిమానుల సైతం మరోసారి ఈ సినిమాని బుల్లితెరపై చూడవచ్చని ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus