ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేని విధంగా ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. తమ ఫేవరెట్ హీరోలు నటించిన సినిమా మూడేళ్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఆర్ఆర్ఆర్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజున హైదరాబాద్ లోని పలు థియేటర్లలో తెల్లవారుజామున స్పెషల్ షోలు ప్రదర్శితం కానున్నాయి. మొత్తం ఆరు స్పెషల్ షోలు ప్రదర్శితం కానుండగా ఈ షోలకు టికెట్ రేటు ఏకంగా 5,000 రూపాయలుగా ఉందని సమాచారం. అభిమానులు కొనలేని స్థాయిలో టికెట్ రేట్లను పెట్టడం అన్యాయమని చరణ్, తారక్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బెనిఫిట్ షో నిర్వాహకులపై చరణ్, తారక్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ఉదయం 8 గంటలకే రెగ్యులర్ షోలు మొదలవుతాయి.
అందువల్ల ఆశించిన స్థాయిలో టికెట్లు అమ్ముడుకాకపోవచ్చని భావించి చరణ్, తారక్ బెనిఫిట్ షోలకు హాజరవుతారని ప్రచారం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం గ్యారంటీ అయినప్పటికీ ఈ టికెట్ రేట్లు ప్రేక్షకులకు ఆమోదయోగ్యంగా లేవు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్ కు టికెట్ రేట్లు మరింత పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో టికెట్ రేట్లు దారుణంగా పెరిగాయి.
తెలంగాణలో ఫస్ట్ వీకెండ్ వరకు మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు 413 రూపాయలుగా ఉండగా సింగిల్ స్క్రీన్ లో 236 రూపాయలుగా ఉన్నాయి. మార్చి 28 నుంచి మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు 354 రూపాయలుగా సింగిల్ స్క్రీన్ లో 212 రూపాయలుగా ఉండనున్నాయి. టికెట్ బుకింగ్ యాప్స్ లో టికెట్లను బుక్ చేసుకునే వాళ్లు సర్వీస్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.