RRR Ticket: ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్లు అలా ఉన్నాయా?

దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఉగాది పండుగను, ఆదివారం సెలవుదినాన్ని బాగానే క్యాష్ చేసుకుందనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పదిరోజుల పాటు ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని కల్పించాయి. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఈరోజునుంచి సాధారణ టికెట్ రేట్లకే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శితం కానుంది. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆర్ఆర్ఆర్ మూవీని థియేటర్లలో చూడటం మిస్ అయిన వాళ్లకు ఇది శుభవార్తే అని చెప్పాలి.

Click Here To Watch NOW

ప్రస్తుతం తెలంగాణలో మల్టీప్లెక్స్ లలో గరిష్టంగా 290 రూపాయలు టికెట్ రేటుగా ఉండగా సింగిల్ స్క్రీన్ లో 175 రూపాయలు టికెట్ రేటుగా ఉంది. తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీలో టికెట్ రేట్లు మరింత తక్కువగా ఉన్నాయి. ఏపీలోని మల్టీప్లెక్స్ లలో 177 రూపాయల గరిష్ట ధర అమలులో ఉంది. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్ లో 145 రూపాయలు గరిష్ట ధరగా ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీకి టికెట్ రేట్లు తగ్గడంతో థియేటర్లలో ఈ సినిమాను మళ్లీ చూడాలని భావించే వాళ్లకు కూడా బెనిఫిట్ కలగనుంది.

టికెట్ రేట్లు తగ్గడంతో వీక్ డేస్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీకి ఆక్యుపెన్సీ పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. ఈ వారం థియేటర్లలో గని మినహా మరే పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. ఈ వీకెండ్ ను కూడా ఆర్ఆర్ఆర్ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. గని మూవీ రిజల్ట్ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నైజాంలో ఈ సినిమా అంచనాలకు అందని స్థాయిలో లాభాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు భారీగా ఉండటంతో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus