RRR Trailer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ ఇప్పుడు రాదట..!

అందరూ అనుకున్నట్లే జరిగింది. డిసెంబరు 3న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సామ్రాజ్యాన్ని మరింతగా చూపిస్తామన్న చిత్రబృందం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అనివార్య కారణాల వల్ల ట్రైలర్‌ విడుదలను వాయిఆ వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొత్త తేదీని మాత్రం ప్రకటించలేదు. నిజానికి ఈ విషయం గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. సినిమా ట్రైలర్‌ అనుకున్న సమయానికి రాదు.. అని నెటిజన్లు చెప్పుకుంటూ వచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నుండి చూచాయగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబరు 10 లేదా 11న ట్రైలర్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ముంబయిలో భారీగా నిర్వహించాలని చిత్రబృందం భావించింది. దీని కోసం సల్మాన్‌ ఖాన్‌ను కూడా కలిశారు. రాజమౌళి, కార్తికేయ… కలసి ఆ మధ్య సల్మాన్‌ ఖాన్‌ను కలిసింది కూడా ఇందుకే. అయితే ఇప్పుడు కార్యక్రమం వాయిదా వేయడానికి కారణాలేంటో అనేది తెలియడం లేదు. హిందీలో ట్రైలర్‌ విడుదల చేశాక… సినిమా ప్రచారం వేగం చేయాలని చిత్రబృందం భావించింది. దీని కోసం పక్కా ప్రణాళికలు చాలానే వేసుకున్నారు.

ఇప్పుడు ఇలా ట్రైలర్‌ రిలీజ్‌ వారం వాయిదా పడటంతో… మొత్తం ప్లాన్స్‌ మారిపోయాయి. ఒకవేళ డిసెంబరు 10 లేదా 11న ప్రచారం మొదలైతే… ఇంకా చిత్రబృందానికి మూడు వారాలే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే ట్రైలర్‌లో దివంగత సిరివెన్నెలకు కృతజ్ఞతలు కార్డ్‌ కచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus