దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గురించి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. నిజానికి వీళ్ళిద్దరూ కలిసినట్టు చరిత్రలో లేదు.
వీళ్ళు పుట్టిన సంవత్సరాలు కానీ వీళ్ళు పెరిగిన ప్రాంతాలు కానీ పూర్తిగా వేరు.ఇది పూర్తిగా ఫిక్షనల్ మూవీ అని రాజమౌళి ఓ మీటింగ్ పెట్టి మరీ చెప్పుకొచ్చాడు. చరిత్రలో ఇద్దరు గొప్ప స్టార్స్ గురించి చెప్పేప్పుడు ఎంతో శ్రద్దగా తీయాలని డిసైడ్ అయినట్టు కూడా ఆయన తెలిపాడు. అయితే ఓ నెటిజెన్ మాత్రం ఈ చిత్రం కథ గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ పెట్టాడు. ‘1920లో స్వాతంత్ర సమరయోధులు ఇంటి నుండీ వెళ్ళిపోయి దాదాపు 2ఏళ్ళ తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారని..
కాబట్టి ఆ గ్యాప్ లో ఏం జరిగిందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్‌ను ఫిక్షన్‌గా తెరకెక్కించాలని రాజమౌళి అనుకోవడంలో తప్పులేదు కానీ.. మనకు తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపించడం ఏంటి అన్నది పెద్ద డౌట్? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ కు ‘ఆర్.ఆర్.ఆర్’ యూనిట్ స్పందిస్తూ… “ఓరీ మీ దుంపలు తెగ… మీరెక్కడ దొరికారు రా..రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా.. క్లియర్‌గా.. మీకు తెలిసిన స్టోరీ సినిమాలో ఉండదు.. మైండ్‌లో నుంచి అవన్ని తీసేసి సినిమాను ఎంజాయ్ చేయండి” అని అంటూ ఫన్నీగా జవాబిచ్చాడు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!