RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ముంబయిలో ఏం చెప్పిందంటే?

  • December 10, 2021 / 12:12 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం చాలా రోజుల నుండి సాగుతున్నా… ట్రైలర్‌ రిలీజ్‌తో అది పీక్స్‌లోకి వెళ్లిపోయింది అని చెప్పొచ్చు. ముంబయిలో ఓ ఈవెంట్‌ పెట్టి మరీ అక్కడ ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో రాత్రి మరో ఈవెంట్‌ పెట్టారు. సినిమా గురించి, సినిమా పాత్రల గురించి, కథ తదితర వివరాల గురించి మీడియాకు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ముంబయిలో ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌ ఏం చెప్పింది అనే విషయాల మీ కోసం.

మళ్లీ ‘బాహుబలి’ అంటే.. నీరు, నిప్పు అనేవి పూర్తి వ్యతిరేకం. ఈ రెండు అంశాలను ఎలా కలుపుతున్నారు అనే ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. నీరు, నిప్పు అనేవి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఇద్దరు హీరోల తత్వాన్ని సూచిస్తాయి. ఆ రెండు ఎందుకు, ఎలా కలిశాయి, కలిశాక ఏం చేశాయి అనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది అని రాజమౌళి చెప్పారు. ‘బాహుబలి’ తర్వాత మాకు మరో ‘బాహుబలి’ కావాలి అని ప్రేక్షకులు అంటున్నారు. నిజానికి వాళ్లకు కావాల్సింది. మరో బాహుబలి కాదు. బాహుబలి సినిమా చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్‌, ఎమోషన్స్‌. దానికి మరో ‘బాహుబలి’ తీయనక్కర్లేదు. అలాంటి సినిమా ఇస్తే చాలు. ఆ ప్రయత్నమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా మీకు నచ్చతుంది అనుకుంటున్నాను అని చెప్పారు రాజమౌళి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం అన్ని భాషల నటులు ఉండాలని మేం అనుకోలేదు. ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అనే చూసుకున్నాం. వారినే ఎంచుకున్నాం. అంతేకానీ ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న భాషల నుండి నటులను తీసుకోవాలని కాదు. అజయ్‌ దేవగణ్‌ అయితే ఆ పాత్రకు సరిపోతారని మా టీమ్‌ అనుకుంది. మేం ఆయన్ని అప్రోచ్‌ అయ్యి… కథ చెప్పగానే… ఆయన ‘మీకు ఎప్పుడు డేట్స్‌ కావాలి’ అని అడిగారు. ఆయనకు అంతగా పాత్ర నచ్చసింది అని చెప్పారు రాజమౌళి. నేను వేరే ఇండస్ట్రీకి సినిమాలు చేయడానికి వెళ్లినా… దేశం మొత్తం అలరించే కథనే చేస్తాను. కాబట్టి నాకు ఏ ఇండస్ట్రీ అయినా ఒక్కేటే అన్నారు జక్కన్న.

ఆ అవకాశమే లేదు…‘అరవింద సమేత’ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మధ్య ఎన్ని సినిమాలు వదులుకున్నారని ఎన్టీఆర్‌ను అడిగితే… ఒక్క సినిమా కథ వినలేదు, వదులుకోలేదు అని చెప్పాడు. రాజమౌళితో సినిమా అన్నాక… ఆ హీరోకు మధ్యలో వేరే దర్శకుడు వచ్చి కథ వినిపించరు. ఆ సినిమా అయ్యాకే అని ఆ దర్శకులకూ తెలుసు అంటూ నవ్వేశాడు తారక్‌. రాజమౌళి తన నటుల మీద నమ్మకం ఉంచుతారు. మేమేదైనా చేయగలమనే నమ్మకం ఇస్తారు. దాంతో ఎలాంటి సీన్‌ అయినా చేసేద్దాం అనిపిస్తుంది. మా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం చూసి మాకు కూడా ఉత్సాహం వస్తుంది. ‘నాటు నాటు’ పాట కానీ, యాక్షన్‌ సీన్స్‌ కానీ… ఏదైనా ఆయన అనుకున్నట్లుగా చేసి చూపించాం అని చెప్పారు తారక్‌.

ఈజీ చేసేశారు. సినిమాలో ఆలియా భట్‌ది చిన్న పాత్రే అయినా చాలా కీలకం అని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ గతంలో చెప్పారు. అంటి ముఖ్యమైన పాత్ర కోసం ఆలియా తొలుత కాస్త ఇబ్బంది పడిందట. తెలియని భాషలో ఎలా అని అనుకుందట. అయితే ఆమె కోసం రాజమౌళి టీమ్‌ అన్నీ సిద్ధం చేసి పెట్టిందట. ‘‘గతంలో నేను మీ సినిమాలో అవకాశం ఇవ్వమని రాజమౌళి సర్‌ని అడిగాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అవకాశం ఇచ్చారు. పాత్ర గురించి ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పేశా. నేను సీతగా మారడానికి టీమ్‌ చాలా సౌకర్యవంతంగా పరిస్థితుల్ని మార్చారు’’ అని చెప్పింది ఆలియా. అలాగే పాత్ర నిడివి లాంటి విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ పాత్ర ఇంపాక్ట్‌ చూడటం ముఖ్యం అని అజయ్‌దేవగణ్‌ అన్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus