రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) .. ఈ కన్నడ బ్యూటీ అందరికీ సుపరిచితమే. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ (Sapta Sagaralu Dhaati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి అప్రిసియేషన్ దక్కించుకుంది. తర్వాత దానికి సెకండ్ పార్ట్ గా వచ్చిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ ప్లాప్ అయ్యింది. అయినా రుక్మిణి వసంత్ పేరు మార్మోగింది. వాస్తవానికి ఈమె తెలుగులో ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిందే.
నిఖిల్ (Nikhil) హీరోగా సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) అంటూ ఓ సినిమా వచ్చింది. అది రుక్మిణీ వసంత్ తెలుగు డెబ్యూ మూవీ. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయినప్పటికీ ఆ సగం సినిమాని రిలీజ్ చేసి వదిలించుకున్నారు. అందులో రుక్మిణీ లుక్స్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉండవు. ఆ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల.. తెలుగులో రుక్మిణీకి అవకాశాలు రావేమో అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా ప్రభాస్ (Prabhas) సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసింది. అవును సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా రూపొందుతుంది. అందులో దీపికా పదుకోనెని (Deepika Padukone) హీరోయిన్ గా అనుకున్నారు. కానీ దీపికా ఆటిట్యూడ్ సందీప్ కి నచ్చలేదు. దీంతో ఆమెను పక్కన పెట్టేశాడు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో..
హీరోయిన్లని మార్చే పని పెట్టుకోవాలి అని దర్శకుడు అనుకుంటే.. ముందుగా హీరోకి చెప్పి.. అతని అనుమతి తీసుకోవాలి. కానీ సందీప్ స్కూల్లో అలాంటివి పనిచేయవు. ఇప్పుడు దీపికా ప్లేస్ లో రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా రీప్లేస్ చేయాలని సందీప్ భావిస్తున్నాడు. ఈ విషయంలో అతను కఠినంగా ఉండటమే బెటర్ అనుకోవాలి.