అప్పుడే సగం పెళ్ళి అయిపోయిందా?

ఇటీవల రెజినాకు నిశ్చితార్థం అయినట్టు వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఇప్పటివరకూ సౌత్ లో హీరోయిన్ గా నటిస్తూ వచ్చిన రెజీనా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో యువ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. అలా అని హిట్లు లేవా అంటే.. ఉన్నాయి. ఇక మంచి గ్లామర్, ఫిజిక్ ఈమె సొంతం అయినా రాణించలేకపోయింది . 26 ఏళ్ళ ఈ బ్యూటీకి జూన్ 13న నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగిందనే న్యూస్ ప్రచారంలో ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

పెళ్ళి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అవ్వాలని రెజీనా నిర్ణయించుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. దీంతో ఆమె కమిట్టయిన ప్రాజెక్టులను పూర్తి చేసి త్వరలో పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతుందట. అయితే ఈ విషయమై రెజీనా ఇంకా స్పందించలేదు. గతంలో ఈ బ్యూటీ సాయి తేజ్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ‘మా మధ్య అలాంటిదేమీ లేదు, మంచి ఫ్రెండ్స్‌ మాత్రమేనని’ క్లారిటీ ఇచింది. ఇక సాయి తేజ్ కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. సందీప్‌కిషన్‌తో కూడా రెజీనా ప్రేమ కలాపాలు సాగించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఓ భేటీలో ‘జీవితంలో ప్రేమ వచ్చి పోయింది. ఒకరినోకరం తొందరపడి దూరం అయ్యామేమో. ఆ తరువాత మొదటి ప్రేమికుడితో స్నేహం కొనసాగుతోంది” అంటూ చెప్పుకొచ్చింది. అయితే రెజీనా ఎంగేజ్ మెంట్ విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus