Jr NTR OTT: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ బిజినెస్ లో ఎంట్రీ ఇస్తున్నారా.. వాస్తవాలివే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara)  సినిమా నుంచి తాజాగా ఒక స్టిల్ రిలీజ్ కాగా ఆ స్టిల్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భుజంపై టవల్ వేసుకుని మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుండగా ఆ వార్త నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

ప్రముఖ ఓటీటీ ఛానల్ తారక్ హోస్ట్ గా ఒక టాక్ షో ప్లాన్ చేసిందని ఆ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే భారీ రెమ్యునరేషన్ లేదా ఓటీటీలో భాగస్వామిగా అవకాశం ఇస్తామని ఆ ఓటీటీ ఆఫర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని సమాచారం అందుతోంది. తారక్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్నారు.

సినిమాలు తప్ప ఇతర షోలపై తారక్ ప్రస్తుతం దృష్టి పెట్టే అవకాశాలు లేవు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి తారక్ ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది. తారక్ ప్రస్తుతం రాజకీయాలకు, పొలిటికల్ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. పాన్ ఇండియా హీరోగా వచ్చిన గుర్తింపును మరింత పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఓటీటీల నుంచి తారక్ కు ఆఫర్లు రావడంలో ఆశ్చర్యం లేదని అయితే ఓటీటీలో భాగస్వామ్యం అంటూ చెబుతుండటమే విచిత్రంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. తారక్ వరుస సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus